లక్నో : నేషనల్ లెవెల్ షూటర్‌ను అంటూ పీడబ్ల్యూడీ ఇంజనీర్‌కు వలపు వల విసిరి ఆపై మోసగించాడు. పెండ్లి చేసుకుంటానని మభ్యపెట్టి లైంగిక దాడికి పాల్పడిన కేటుగాడి ఉదంతం వెలుగుచూసింది. బాధితురాలు లక్నోలోని పీడబ్ల్యూడీ ఇంజనీర్ ఇందిరా నగర ప్రాంతంలో నివసిస్తోంది. ఐదేండ్ల కిందట పీడబ్ల్యూడీ కార్యాలయంలో ఓ టెండర్‌కు సంబంధించి ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.
ఆపై తరచూ వారు మాట్లాడుకునేవారు. ఆపై మహిళతో సన్నిహిత సంబంధం పెంచుకున్న నిందితుడు తాను షూటింగ్లో గోల్డ్ మెడల్ గెలుచుకున్నానని చెప్పుకుంటూ పెండ్లి పేరుతో లైంగిక దాడికి పాల్పడ్డాడు. గోమతినగర్‌లోని మహిళ అపార్ట్మెంట్లో పలుమార్లు ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశాడు.
పెండ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తే చంపేస్తానని బెదిరించాడని మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని ప్రసాద్ విజయ్‌గా గుర్తించి అతడిని హనుమాన్ ఆలయం వద్ద గురువారం అరెస్ట్ చేశారు. తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశామని డీసీపీ నార్త్‌జోన్ ఎస్ చిన్నప్ప వెల్లడించారు.