‘సఖి, బొంబాయి సినిమాల్ని స్ఫూర్తిగా తీసుకొని సినిమాటోగ్రాఫర్‌గా మారాను. కథానుగుణంగా బెస్ట్ విజువల్స్ అందించడమే నా లక్ష్యం’ అన్నారు సినిమాటోగ్రాఫర్ రాజ్ కె నల్లి. ఆయన ఛాయాగ్రహణం అందించిన తాజా చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’. కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా శ్రీధర్ గాదె దర్శకత్వంలో కోడి దివ్యదీప్తి నిర్మించారు. సెప్టెంబర్ 9న విడుదలకానుంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రాజ్ కె నల్లి మాట్లాడుతూ ‘రారండోయ్ వేడుక చూద్దాం, అర్జున్ సురవరం, దేవదాస్, ఉప్పెన చిత్రాలకు అసోసియేట్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశా. ఆ తర్వాత సెబాస్టియన్, పంచతంత్రం సినిమాలు చేశాను. హీరో కిరణ్‌తో నాకిది రెండో సినిమా. ఆయన్ని కొత్తగా చూపించాలనే ప్రయత్నం చేశా. తను ఎంత టెన్షన్‌గా ఉన్నా కెమెరా ముందుకురాగానే ఎమోషన్స్‌ను పర్ఫెక్ట్గా పండిస్తాడు. చక్కటి కథతో పాటు విజువల్ పరంగా కూడా ఈ సినిమా మెప్పిస్తుంది. ప్రస్తుతం నేను పనిచేస్తున్న ‘పంచతంత్రం’ విడుదలకు సిద్ధంగా ఉంది. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘రంగ మార్తాండ’ షూటింగ్ ఒక్కరోజు బ్యాలెన్స్‌గా ఉంది’ అని చెప్పారు.