హైదరాబాద్: విజయ్ మాల్యా ఇవాళ తన ట్విట్టర్లో క్రిస్ గేల్ ఫోటోను షేర్ చేశాడు. ఒకప్పుడు ఐపీఎల్లో బెంగుళూరు జట్టుకు ఓనర్‌గా మాల్యా ఉన్న సమయంలో.. ఆ జట్టుకే క్రిస్ గేల్ ఆడేవాడు. 2011 నుంచి 2017 సీజన్ వరకు రాయల్ ఛాలెంజెర్స్ బెంగుళూరు జట్టుకు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఇటీవల గేల్‌ను మాల్యా కలిశాడు. ఈ సందర్భంగా తన ట్విట్టర్లో ఓ ఫోటోను పోస్టు చేశాడు. గేల్ తనకు మంచి మిత్రుడని, అతన్ని కలవడం సంతోషంగా ఉందన్నాడు. ఆర్సీబీకి గేల్‌ను తానే రిక్రూట్ చేశానని, అప్పటి నుంచి తమ మధ్య సూపర్ ఫ్రెండ్షిప్ ఉన్నట్లు తన ట్వీట్లో మాల్యా తెలిపాడు. మాల్యా చేసిన ట్వీట్‌కు గంటల్లోనే వేల లైక్‌లు వచ్చేశాయి. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా జట్ల తరపున కూడా గేల్ ఆడాడు. ఐపీఎల్లో మొత్తం 142 మ్యాచ్‌లు ఆడిన అతను 4965 రన్స్ చేశాడు. స్ట్రయిక్ రేట్ 148.96 కాగా, బ్యాటింగ్ సగటు 39.72గా ఉంది. ఐపీఎల్లో గేల్ ఆరు సెంచరీలు కొట్టాడు. 2013లో పూణెపై అత్యధికంగా 175 రన్స్ చేశాడు.
Great to catch up with my good friend Christopher Henry Gayle @henrygayle , the Universe Boss. Super friendship since I recruited him for RCB. Best acquisition of a player ever. pic.twitter.com/X5Ny9d6n6t
— Vijay Mallya (@TheVijayMallya) June 22, 2022