Cobra Movie On OTT | చియాన్ విక్రమ్ చాలా కాలం తర్వాత ‘మహాన్’తో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. అదే జోష్‌లో ‘కోబ్రా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య ఆగస్టు 30న విడుదలైన ఈ చిత్రం అశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇప్పటికే చాలా వరకు థియేటర్లలో నుండి కోబ్రా వెళ్ళిపోయింది. అయితే ఈ చిత్రంలో విక్రమ్ నటనకు మాత్రం గొప్ప ప్రశంసలు దక్కాయి. విభిన్న గెటప్స్‌లో విక్రమ్ నటించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ చిత్రం ఓటీటీ డేట్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా డిజిటల్ రిలీజ్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
కోబ్రా మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లివ్ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 23 లేదా 30న స్ట్రీమింగ్ చేయాలని భావిస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఈ చిత్రంలో విక్రమ్ ద్విపాత్రాభినయం చేశాడు. కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి, మృనాళిని రవి హీరోయిన్లుగా నటించారు. ప్రముఖ క్రికెటర్ ఇర్ఫాన్ ఖాన్ కీలకపాత్రలో నటించాడు. మలయాళ నటుడు రోషన్ మాథ్యూ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఏఆర్. రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడీయో పతాకంపై ఎస్.ఎస్ లలిత్‌కుమార్ నిర్మించాడు.
Read Also:
Ponniyin Selvan | ‘పొన్నియన్ సెల్వన్’లో ఐశ్వర్యరాయ్ విలన్‌గా నటిస్తుందా?
Super Good Films | సూపర్ గుడ్ ఫిలింస్ 100వ చిత్రంలో ఆ స్టార్ హీరో నటిస్తున్నాడా?
Raviteja | రవితేజకు జోడీగా అనుపమ పరమేశ్వరణ్?
Alluri Movie | శ్రీ విష్ణు ‘అల్లూరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌గా గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్?