Chiyan Vikram | తమిళ నటుడు చియాన్ విక్రమ్‌కు శుక్రవారం ఉదయం హార్ట్ ఎటాక్ వచ్చింది. వెంటనే చెన్నైలోని కావేరీ హాస్పిటల్‌కు విక్రమ్‌ను తరలించారు. ప్రస్తుతం ఈయన హెల్త్ గురించి హస్పిటల్ నుండి ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే విక్రమ్ శుక్రవారం సాయంత్రం జరగాల్సిన ‘పొన్నియిన్ సెల్వన్’ టీజర్ లాంఛ్ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది.
విక్రమ్.. పేరుకు తమిళ హీరోనే అయినా తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. ఈయనకు టాలీవుడ్ హీరోలకు సమానంగా ఇక్కడ క్రేజ్ ఉంది. తెలుగు హీరోలకు ధీటుగా ఈయన డబ్బింగ్ సినిమాలు కలెక్షన్లు సాధిస్తుంటాయి. ‘శివపుత్రుడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విక్రమ్.. ‘అపరిచితుడు’ సినిమాతో విపరీతమైన అభిమానులను ఏర్పరచుకున్నాడు. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలై సంచలన విజయం సాధించింది. అంతేకాకుండా ఈ సినిమాతో తెలుగులో ఈయనకు మంచి మార్కెట్ ఏర్పడింది. ఆ తర్వాత వరుసగా ‘మల్లన్న’, ‘విలన్’, ‘ఐ-మనోహరుడు’, ‘ఇంకొక్కడు’ వంటి సినిమాలు తెలుగులో మంచి విజయాలు సాధించాయి. గత కొంత కాలంగా వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న విక్రమ్‌కు ‘మహాన్’ మంచి కంబ్యాక్ ఇచ్చింది. కొడుకు ధృవ్‌తో కలిసి నటించిన ఈ చిత్రం నేరుగా అమెజాన్‌లో విడుదలై మంచి వ్యూవర్ షిప్‌ను సాధించింది.
ప్రస్తుతం ఈయన ప్రాధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘కోబ్రా’ ఆగస్టు 11న విడుదల కానుంది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కేజీఎఫ్ ఫేం శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. దీనితో పాటుగా ఈయన నటించిన ‘పొన్నియిన్ సెల్వన్’ సెప్టెంబర్ 30న విడుదలకానుంది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమ్ ఆదిత్య కరికాలన్‌గా నటించాడు. ఇటీవలే విడుదలైన ఈయన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది.