Godfather Movie | ‘ఖైదీ నం.150’తో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన చిరు.. అదే జోష్‌ను తరువాతి చిత్రాల్లో కంటిన్యూ చేయలేకపోతున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ‘సైరా’, ‘ఆచార్య’ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో మెగా అభిమానులు తీవ్రంగా నిరాశపడ్డాడు. ఈ క్రమంలో మలమాళ సూపర్ హిట్ ‘లూసీఫర్’ రీమేక్‌తో ఇటీవలే ‘గాడ్‌ఫాదర్’ పేరుతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ చిత్రం విడుదల రోజు నుండి బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది. కాగా ఓపెనింగ్స్ భారీ రేంజ్లో రాకపోయినా.. తర్వాత రెండు రోజులు చిరు క్రేజ్‌కు తగ్గ కలెక్షన్లే వచ్చాయి. అయితే నాల్గవ రోజు నుండి గాడ్‌ఫాదర్ కలెక్షన్లు పూర్తిగా డల్ అయ్యాయి.
ముఖ్యంగా సోమవారం ఈ సినిమా రెండు కోట్ల షేర్‌ను కూడా సాధించలేకపోయింది. ఇప్పటివరకు ఈ సినిమా సుమారుగా రూ.52 కోట్ల వరకు షేర్‌ను సాధించింది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా రూ.40 కోట్ల వరకు సాధించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడున్న జోరు చూస్తుంటే గాడ్‌ఫాదర్ బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టంగానే కనిపిస్తుంది. ఈ సినిమాతోనైనా భారీ విజయాన్ని సాధించాలన్న చిరు కల.. కలగానే మిగిలిపోయింది. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ కీలకపాత్రలో నటించాడు. నయనతార చిరుకు చెల్లెలిగా నటించింది. ఇక బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్లో నటించాడు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మెగా సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించాయి.
Read Also:
Siva Karthikeyan | నాగచైతన్య దర్శకుడితో.. శివ కార్తికేయన్ నెక్స్ట్ చిత్రం..!
Mega154 | దీపావళికి మెగా సర్ప్రైజ్.. చిరు అభిమానులకు పండగే..!
Ram Setu | ఆసక్తి రేకెత్తిస్తున్న అక్షయ్‌కుమార్ ‘రామ్‌సేతు’ ట్రైలర్..!
Ravi Teja | రీ-రిలీజ్‌కు రెడీ అవుతున్న రవితేజ బ్లాక్‌బస్టర్ మూవీ?