మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం గాడ్ ఫాదర్ (Godfather). ఇప్పటికే విడుదలైన రెండు పాటలు, టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో గాడ్ ఫాదర్ ట్రైలర్ ను మేకర్స్ లాంఛ్ చేశారు.
మన స్టేట్ సీఎం పీకేఆర్ ఆకస్మిక మరణం..మంచోళ్లందరు మంచోళ్లు కాదు..చాలా డ్రామాలు జరుగుతున్నాయి వెనుక..అన్ని రంగులు మారతాయి..అంటూ పూరీ జగన్నాథ్ వాయిస్ ఓవర్‌తో సాగే డైలాగ్స్‌తో మొదలైంది ట్రైలర్. ‘నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను..కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదు. నేనున్నంత వరకు ఈ కుర్చీకి చెదపట్టనివ్వను’ అంటూ చిరు చెబుతున్న సంభాషణలు సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి.
మోహన్ రాజా (Mohan Raja) డైరెక్ట్ చేస్తున్న గాడ్ ఫాదర్ అక్టోబర్ 5న రిలీజ్ కానుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లపై గాడ్ ఫాదర్ చిత్రాన్ని సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, డైరెక్టర్ పూరీ జగన్నాథ్, సునీల్, సత్యదేవ్, నయనతార కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read Also : Brahmastra 2 | బ్రహ్మాస్త్ర 2లో మరో ఇద్దరు స్టార్ హీరోలు..కొత్తగా జాయిన్ అయ్యేది వీరే..!
Read Also : Trivikram | మహేశ్ కోసం తొలిసారి త్రివిక్రమ్ కొత్త ప్రయత్నం..వర్కవుట్ అయ్యేనా..?
Read Also : Ravi Kishan | రూ.3.25 కోట్లు మోసం..స్నేహితుడిపై ‘రేసు గుర్రం’ విలన్ ఫిర్యాదు..!