బీజింగ్ : చైనా తన అంతరిక్ష కేంద్రం సరఫరా మిషన్ కోసం టియాన్జౌ-2 ను శనివారం రాత్రి విజయవంతంగా ప్రయోగించింది. సొంతంగా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రం టియాన్హేకు పరికరాలు, చోదక యంత్రాలను మోసే ఆటోమేటెడ్ కార్గో అంతరిక్ష నౌకను చైనా ప్రయోగించింది. టియాన్జౌ -2 ను తీసుకెళ్తున్న లాంగ్ మార్చి -7 వై 3 రాకెట్‌ను దక్షిణ ద్వీప ప్రావిన్స్ హైనాన్ తీరంలో వెన్చాంగ్ స్పేస్‌క్రాఫ్ట్ లాంచ్ సైట్ నుంచి ప్రయోగించినట్లు చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ ప్రకటించింది.
స్పేస్‌క్రాఫ్ట్ టియాన్జౌ -2 పరికరాలు, ప్రొపెల్లెంట్‌ను అందించడానికి అంతరిక్ష కేంద్రం టియాన్హే మాడ్యూల్‌ను చేరుకోనున్నది. సాంకేతిక కారణాల వల్ల వారం రోజుల ఆలస్యంగా టియాన్జౌ-2ను ప్రయోగించారు. ప్రారంభం ఆలస్యమైనప్పటికీ టియాన్జౌ -2 మొదటి అంతరిక్ష కేంద్రం సరఫరా మిషన్ కోసం ప్రయోగించినట్లు ప్రభుత్వం ఆధ్వర్యంలోని గ్లోబల్ టైమ్స్ వార్తాపత్రిక నివేదించింది.
వచ్చే ఏడాది చివరి నాటికి అంతరిక్ష కేంద్రం నిర్మాణాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో చైనా తన అంతరిక్ష కేంద్రం కోర్ మాడ్యూల్‌ను ఏప్రిల్ 29 న విజయవంతంగా ప్రారంభించింది. ఇది చైనా అతిపెద్ద రాకెట్ లాంగ్ మార్చి -5 బీ వై 2 ను ఉపయోగించి ప్రయోగించబడింది. ఇది కోర్ మాడ్యూల్ ఉంచిన తర్వాత భూమికి తిరిగివస్తూ ఈనెల 9 న మాల్దీవులకు సమీపంలోని హిందూ మహాసముద్రంలో కుప్పకూలిపోయింది.
చైనాలో కలవరపెడుతున్న కొత్త రకం స్ట్రెయిన్
లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టిన పుల్వామా వీరుడి సతీమణి
ఎస్పీ నేత అజంఖాన్ ఆరోగ్య పరిస్థితి విషమం
తిటు ద్వీపంపై చైనాకు ఫిలిప్పీన్స్ సవాలు
కుక్కల్లో దొరికిన కరోనా వైరస్ మనుషుల్లో గుర్తింపు
కేరళకు 100 కి.మీ దూరంలో నైరుతి రుతుపవనాలు
పర్యావరణ పరిరక్షణకు మూడు చారిత్రక నిర్ణయాలు
2021 సెషన్ కోసం ఆన్లైన్ కోర్సులను ప్రారంభించిన యూజీసీ
వ్యాక్సిన్ వేసుకుంది.. లాటరీ కొట్టేసింది..
నా రూటే సెపరేటు అన్నాడు.. పుష్ అప్స్ తీయించాడు..
ఎవరెస్ట్‌ను అధిరోహించిన నార్గే, హిల్లరీ.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..