e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, May 12, 2021
Home News కొత్తిమీర‌తో జీర్ణ సమస్యలకు చెక్‌..!

కొత్తిమీర‌తో జీర్ణ సమస్యలకు చెక్‌..!

కొత్తిమీర‌తో జీర్ణ సమస్యలకు చెక్‌..!

నిత్యం మ‌నం ఇండ్లలో చేసుకునే ప‌లు కూర‌ల్లో కొత్తిమీర‌ను వేస్తుంటాం. దీని ద్వారా కూర‌ల‌కు మంచి టేస్ట్ వస్తుంది. అంతేకాదు, కొత్తిమీర‌ను అలాగే నేరుగా కూర‌గా చేసుకున్నా లేదా ప‌చ్చడిగా చేసుకు తిన్నా అద్భుతంగా ఉంటుంది. అయితే నిజానికి కొత్తిమీర‌ను కొన్ని వేల సంవత్సరాల కింద‌టే వినియోగంలోకి తెచ్చారు. ఈ మొక్క మంచి వాస‌న‌ను ఇస్తుంది. కొత్తిమీర‌లో మ‌న శ‌రీరానికి ప‌నికొచ్చే ఎన్నో ప్రోటీన్లు, విట‌మిన్లు, ల‌వ‌ణాలు, లోహాలు ఉంటాయి. ఈ క్రమంలోనే కొత్తిమీర‌ను నిత్యం వాడ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

కొత్తిమీర త్రిదోషాలను హరిస్తుంది. శ‌రీరంలో వాత‌, పిత్త‌, క‌ఫాల‌ల్లో అస‌మాన‌త‌లు ఉండ‌డం వ‌ల్ల అనారోగ్యాలు వ‌స్తాయ‌ని ఆయుర్వేదం చెబుతోంది క‌దా. అయితే కొత్తిమీరను నిత్యం వాడ‌డం వ‌ల్ల త్రిదోషాలు హ‌రించుకుపోతాయి. దీంతో ఆరోగ్యవంతులుగా త‌యార‌వ‌చ్చు.

జీర్ణ సమస్యలను నివారించ‌డంలో కొత్తిమీర అద్భుతంగా ప‌నిచేస్తుంది. కొత్తిమీర జ్యూస్‌ను ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తాగితే జీర్ణ సమస్యలైన గ్యాస్‌, అసిడిటీ, మలబద్దకం త‌గ్గుతాయి.

కొత్తిమీర జ్యూస్‌ను రోజూ తాగడం వ‌ల్ల శ‌రీరం శుభ్రవుతుంది. శ‌రీరంలో ఉండే విష, వ్యర్థ ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి.

జ్వరం వ‌చ్చిన వారు కొత్తిమీర జ్యూస్ తాగితే ఫ‌లితం ఉంటుంది. కొత్తిమీర‌లో ఉండే యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌ల్‌, యాంటీ మైక్రోబియ‌ల్ గుణాలు అన్ని ర‌కాల జ్వరాల‌ను తగ్గిస్తాయి.

కొత్తిమీర జ్యూస్ తాగ‌డం వ‌ల్ల పురుషుల‌లో శృంగార సామ‌ర్థ్యం కూడా పెరుగుతుంది.

జీర్ణకోశంలో గ్యాస్‌ ఉత్పత్తి కానివ్వదు. సులభంగా మూత్ర విసర్జన జరిగేట్టు చేసి కిడ్నీల ఆరోగ్యానికి కొత్తిమీర‌ దోహదపడుతుంది.

కొత్తిమీర జ్యూస్‌ తీసుకోవడం వల్ల విటమిన్ ఎ, బి1, బి2, సి లభిస్తాయి. ఐరన్ లోపంతో బాధపడుతున్న వారు కొత్తిమీర జ్యూస్‌ను తాగితే ఫ‌లితం ఉంటుంది.

కొత్తిమీర టీ తాగితే రక్తంలో కొలెస్ట్రాల్‌, లిపిడ్ లెవ‌ల్స్ తగ్గుతాయి. యువతులలో హార్మోన్లు స‌రిగ్గా ప‌నిచేస్తాయి.

Advertisement
కొత్తిమీర‌తో జీర్ణ సమస్యలకు చెక్‌..!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement