ముంబై, జూలై:కరోనా నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును భారీగా తగ్గించిన విషయం తెలిసిందే. రెపోరేటు తగ్గడంతో హోమ్ లోన్ వడ్డీ రేట్లు దిగొచ్చాయి. 2019 సెప్టెంబర్ నాటికి అతి తక్కువ హోమ్ లోన్ వడ్డీ రేటు 8.40 శాతంగా ఉన్నది. ప్రస్తుతం ఏకంగా 6.49 శాతం నుంచి 6.95 శాతం మధ్య ఉన్నది. రెపోరేటు తగ్గించడంవల్ల వడ్డీ రేట్లు దాదాపు రెండు శాతం మేర తగ్గాయి. అంటే నాటి వడ్డీ రేట్లతో పోలిస్తే ప్రస్తుత వడ్డీ రేట్ల వల్ల మొత్తం ఇరవై ఏండ్లలో లక్షల్లో ఆదా అవుతుంది.
16 బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు రూ.75 లక్షలకు పైగా హోమ్ లోన్‌ను ఏడు శాతం కంటే తక్కువ వడ్డీ రేటుకు అందిస్తున్నాయి. ఈ బ్యాంకుల్లోను ప్రయివేటు రంగ దిగ్గజం కొటక్ మహీంద్రా బ్యాంకు, ప్రభుత్వరంగ పంజాబ్ అండ్ సింద్ బ్యాంకులు తక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. ఈ బ్యాంకుల్లో వడ్డీ రేటు 6.65 శాతం మాత్రమే. ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బిఐ)లో 6.95 శాతం, ప్రయివేటు రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీలో హోమ్ లోన్ వడ్డీ రేటు 7 శాతంగా ఉన్నది.
ఇప్పటికే హోమ్ లోన్ తీసుకొని హోమ్ లోన్ ఈఎంఐ చెల్లిస్తున్న వారు కూడా తక్కువ హోమ్ లోన్ వడ్డీ రేటు ఉన్న బ్యాంకుకు మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. తద్వారా వారు తమ వడ్డీ రేటు భారాన్ని తగ్గించుకునే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా 2019 , అక్టోబర్ 1వ తేదీ కి ముందు హోమ్ లోన్ తీసుకున్న వారికి ఇది ప్రయోజనం. ఎందుకంటే ఆ తర్వాత వడ్డీ రేట్లు తగ్గిపోయాయి కాబట్టి.
ఏ బ్యాంక్ లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే..?
-రూ.75 లక్షల హోమ్ లోన్ 20ఏండ్ల కాలపరిమితికి తీసుకుంటే వడ్డీ రేట్లు, ఈఎంఐ ఇలా ఉండవచ్చు.
-కొటక్ మహీంద్రా బ్యాంకు వడ్డీ రేటు 6.65 శాతం, ఈఎంఐ రూ.56,582.
-పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు వడ్డీ రేటు 6.65 శాతం, ఈఎంఐ రూ.56,582.
-బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేటు 6.75 శాతం, ఈఎంఐ రూ.57,027.
-బజాజ్ ఫిన్ సర్వ్ వడ్డీ రేటు 6.75 శాతం, ఈఎంఐ రూ.57,027.
-పంజాబ్ నేషనల్ బ్యాంకు వడ్డీ రేటు 6.80 శాతం, ఈఎంఐ రూ.57,250.
-సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటు 6.85 శాతం, ఈఎంఐ రూ.57,474.
-ఐడీబీఐ బ్యాంకు వడ్డీ రేటు 6.85 శాతం, ఈఎంఐ రూ.57,474.
-బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటు 6.85 శాతం, ఈఎంఐ రూ.57,474.
-కెనరా బ్యాంకు వడ్డీ రేటు 6.90 శాతం, ఈఎంఐ రూ.57,698.
-యూనియన్ బ్యాంకు వడ్డీ రేటు 6.90 శాతం, ఈఎంఐ రూ.57,698.
-యాక్సిస్ బ్యాంకు వడ్డీ రేటు 6.90 శాతం, ఈఎంఐ రూ.57,698.
-యూకో బ్యాంకు వడ్డీ రేటు 6.90 శాతం, ఈఎంఐ రూ.57,698.
-బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వడ్డీ రేటు 6.90 శాతం, ఈఎంఐ రూ.57,698.
-టాటా క్యాపిటల్ వడ్డీ రేటు 6.90 శాతం, ఈఎంఐ రూ.57,698.
-ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ వడ్డీ రేటు 6.90 శాతం, ఈఎంఐ రూ.57,698.