e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News తెలంగాణలో నేడు, రేపు వర్షాలు

తెలంగాణలో నేడు, రేపు వర్షాలు

తెలంగాణలో నేడు, రేపు వర్షాలు

హైదరాబాద్‌ : తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆది, సోమవారాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి నుంచి గాలులు లోయర్ ట్రోపోస్పీయర్ వరకు బలంగా వ్యాపించి, చాలా ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది. తూర్పు మధ్య బంగాళాఖాతం, దాన్ని అనుకొని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. అది ఇవాళ వాయుగుండగా మారే సూచనలున్నాయని అధికారులు పేర్కొన్నారు. మరింత బలపడిన సోమవారం నాటికి తుఫానుగా మారుతుందని, ఈ నెల 25వ తేదీకి తీవ్ర తుఫానుగా మారుతుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వాయువ్య దిశగా ప్రయాణించి 26న ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది.

ఇవి కూడా చదవండి..

జాబ్‌ ఎర.. 40 లక్షలు దోపిడీ
ఉద్యోగుల కుటుంబాలకూ టీకా
సీబీఎస్‌ఈ పరీక్షలపై రక్షణ మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తెలంగాణలో నేడు, రేపు వర్షాలు

ట్రెండింగ్‌

Advertisement