Matka Bowl | మట్టిపాత్రల్లో వంట పూర్వం నుంచీ వస్తున్న సంప్రదాయమే. ఇప్పటికీ పల్లెల్లో మట్టిపాత్రలు కనిపిస్తూనే ఉంటాయి. తాజాగా మట్టిపాత్రల వాడకం మరోసారి పుంజుకుంది. మట్టికుండల్లో నింపిన నీళ్లు, మట్టిపాత్రల్లో వండిన వంటలు ఆరోగ్యానికి మంచివని నిపుణులు కూడా చెబుతున్నారు.
మట్టిపాత్రల్లో వండివార్చిన చేపలకూర, పులుసుకు నగరాల్లోనూ మంచి గిరాకీ ఉంటున్నది. మట్కా చాయ్, మట్కా పిజ్జా, మట్కా బిర్యానీ (కుండ బిర్యానీ), మట్కా దోశ, మట్కా ఐస్క్రీమ్, మట్కా బాసుందీ.. ఇలా ఒకటేమిటి, అన్ని ఆహార పదార్థాలూ మట్టిపాత్రల్లో వండి వారుస్తున్నారు. ఆధునిక కిచెన్లలోనూ అందంగా అమరిపోయేలా కుక్కర్లు, పాన్లు, గ్లాసులు, కడాయిలు కూడా అందుబాటులోకి వచ్చాయి.
“Neem Wood | మీ వంటింట్లో వేప చెక్క ఉందా?”