e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 19, 2021
Home News ఓ జీవిత పాఠంలా అనిపించింది!

ఓ జీవిత పాఠంలా అనిపించింది!

‘ఆర్‌.ఎక్స్‌.100’ చిత్రంతో యువతరంలో మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్నారు యువ కథానాయకుడు కార్తికేయ. జయాపజయాలకు అతీతంగా కథాంశాల ఎంపికలో కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘చావు కబురు చల్లగా’. బన్నీ వాసు నిర్మాత. కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకుడు. నేడు ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం కార్తికేయ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..

ఈ సినిమా ప్రయాణం ఎలా మొదలైంది?

2019లోనే గీతా ఆర్ట్స్‌ నుంచి ఈ సినిమా ఆఫర్‌ వచ్చింది. ఫోన్‌కాల్‌ స్వీకరించినప్పుడే ఎగ్జయిటింగ్‌గా ఫీలయ్యా. తెలుగు చిత్రసీమలో గొప్ప ఇమేజ్‌, విజయవంతమైన ప్రస్థానం కలిగిన సంస్థ నుంచి ఆఫర్‌ రావడం అదృష్టంగా భావించాను. దర్శకుడు కౌశిక్‌ కథ చెప్పినప్పుడు చిన్నవయసులో ఇంతటి తాత్వికమైన ఆలోచనలతో కథ ఎలా రాసుకున్నాడో అని ఆశ్చర్యపోయాను. స్క్రిప్ట్‌ వింటున్నప్పుడు ఓ జీవితపాఠంలా అనిపించింది. 

ఈ కథలో ఆకట్టుకున్న అంశాలేమిటి?

- Advertisement -

శవాల్ని తీసుకెళ్లే అంబులెన్స్‌ నడిపే యువకుడి కథ ఇది. అతడు ఓ విధవరాలిని ప్రేమిస్తాడు. బ్రతుకు, చావు, పెళ్లి, ప్రేమ..వంటి అంశాలపై అతని ఆలోచనలు సాధారణ వ్యక్తుల కంటే భిన్నంగా ఉంటాయి. భర్త చనిపోయిన ఓ మహిళను అతను ప్రేమించడం..ఆ ఇద్దరి ప్రయాణం చాలా ఆసక్తికరంగా అనిపించింది.  ఈ సినిమాలో ఎమోషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ సమపాళ్లలో ఉంటాయి.

‘ఆర్‌.ఎక్స్‌.100’ తర్వాత ఆశించిన విజయాలు రాలేదు కదా..?

 ప్రతి సినిమా సక్సెస్‌ అవుతుందనే నమ్మకంతో చేస్తాం. ఒక్కోసారి అంచనాలు తప్పుతాయి. కొన్ని సినిమాల గురించి మా కంటే బయటివాళ్లే ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఈ సినిమాతో నేను హిట్‌ కొట్టబోతున్నానని  చాలా మంచి  చెప్పడం ఆనందంగా ఉంది. ‘ఆర్‌.ఎక్స్‌ 100’ సినిమా 

విడుదలకు ముందు కూడా ఇదే తరహా పాజిటివ్‌ వాతావరణం కనిపించింది.

సినిమా ఫెయిల్యూర్స్‌ను మీరెలా విశ్లేషిస్తారు?

కొన్ని సినిమాల విషయంలో నా జడ్జ్‌మెంట్‌ ఫెయిల్‌ అయింది. నేను ఇండస్ట్రీ బయటి నుంచి వచ్చాను కాబట్టి కాంబినేషన్స్‌ సెట్‌ చేసి కథల విషయంలో సలహాలు ఇచ్చేవారెవరూ లేరు. సినీ ప్రయాణంలో నేనింకా నేర్చుకునే క్రమంలో ఉన్నాననుకుంటున్నా. జయాపజయాల గురించి ఆలోచించడం కంటే ప్రతి సినిమాకు ఒకే రకమైన అంకితభావంతో శ్రమించాలన్న సిద్ధాంతాన్ని బలంగా విశ్వసిస్తా. భవిష్యత్తులో తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నా. 

సుకుమార్‌ రైటింగ్స్‌లో చేయబోతున్న సినిమా ఎలా ఉండబోతుంది?

సుకుమార్‌గారు ‘ఆర్‌.ఎక్స్‌.100’ టైమ్‌ నుంచే నన్నెంతగానో ప్రోత్సహిస్తున్నారు. ప్రతి సినిమాలో నా యాక్టింగ్‌ గురించి విశ్లేషిస్తుంటారు. సుకుమార్‌గారి సంస్థలో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది.

చావు కబురు చల్లగా’ చిత్రంలో లావణ్యత్రిపాఠి వంటి సీనియర్‌ నాయికతో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?

నేను కాలేజీలో ఉన్నప్పుడు ‘అందాల రాక్షసి’ సినిమా చూశాను.  ఓ సాధారణ యువకుడిగా తెరపై చూసిన కథానాయికతో నేడు కలిసి నటించడం మరచిపోలేని అనుభూతినిచ్చింది. 

ఈ సినిమాలో పాత్ర కోసం ఎలా సన్నద్ధమయ్యారు?

ముందు వర్క్‌షాప్‌ చేశాం. నా పాత్ర ఎలా కనిపించాలనే విషయంపై చాలా చర్చించాం. నా ఆహార్యం మొదలుకొని యాసభాషల వరకు ప్రతి అంశంపై శ్రద్ధ తీసుకున్నాం.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana