సీహెచ్ నరేష్ హీరోగా నటిస్తున్న సినిమా ‘సామాన్యుడి ధైర్యం’. రమణ కొఠారు కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో దర్శకుడు రామ్ బొత్స ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్లో జరిగింది.
ఈ సందర్భంగా నిర్మాత రమణ కొఠారు మాట్లాడుతూ…‘సామాజిక కథాంశంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. కొత్త వాళ్లతో పాటు పేరున్న ఆర్టిస్టులు ఇందులో నటిస్తున్నారు. వినోదం, యాక్షన్ వంటి కమర్షియల్ అంశాలు కథలో ఉంటాయి. సామాన్యుడి ధైర్యం ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపించబోతున్నాం’ అన్నారు. బి. రామ్, కె. హారిక, పీవీ చంద్రశేఖర్, ఆమదాల లక్ష్మీ దేవి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : భాస్కర్ దోర్నాల, సంగీతం : సాకేత్ వేగి.