e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home News అటవీ చట్టానికి తూట్లు!

అటవీ చట్టానికి తూట్లు!

 • చట్టాన్ని బలహీనపరిచేలా కేంద్ర ప్రభుత్వం సవరణలు
 • కార్పొరేట్లకు మేలు చేకూర్చే విధంగా ప్రతిపాదనలు
 • అటవీ భూముల మళ్లింపును చట్టపరం చేస్తూ మార్పులు
 • సూచనలకు 15 రోజుల గడువు.. హడావుడిగా చర్యలు
 • మండిపడుతున్న విపక్షాలు, పర్యావరణవేత్తలు, నిపుణులు

భూతాపం, అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి విపత్తులను అడ్డుకునే సహజసిద్ధమైన అత్యుత్తమ పరిష్కారం అడవుల పరిరక్షణ. సమస్త జీవజాలానికి పొదరిల్లుగా నిలుస్తూ.. పుడమితల్లిని చల్లబరుస్తున్న ఈ అరణ్యాలను ఇంతకాలం ‘అటవీ పరిరక్షణ చట్టం1980’ కవచంలా కాపాడుతున్నది. అయితే సవరణల పేరిట ఈ చట్టానికి తూట్లు పొడిచేందుకు కేంద్రప్రభుత్వం యత్నిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. కార్పొరేట్లకు మేలుచేకూర్చేలా సవరణలు చేస్తున్న కేంద్రం వైఖరిపై పర్యావరణ ప్రేమికులు, నిపుణులతో పాటు విపక్షాలు కూడా పెద్దఎత్తున విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఏమిటీ చట్టం? కొత్తగా తీసుకొస్తున్న సవరణలు ఏమిటి? దీంతో జరుగబోయే నష్టాలేమిటి? తదితర అంశాలపై సమగ్ర కథనం..

ఏమిటీ చట్టం, లక్ష్యమేమిటి?

1920ల్లో బ్రిటిష్‌ పాలకులు తీసుకొచ్చిన అటవీ చట్టానికి కొనసాగింపుగా 1980లో అటవీ పరిరక్షణ చట్టాన్ని తీసుకువచ్చారు. అటవీ భూముల రక్షణ, చెట్ల నరికివేత నిర్మూలనే దీని లక్ష్యం. 1988లో ఒకసారి, 1996లో మరోసారి ఈ చట్టానికి సవరణలు చేశారు.

చేయబోతున్న తాజా సవరణలు ఏమిటి?

- Advertisement -

అటవీ భూముల మళ్లింపునకు చట్టపరంగా ఉన్న కఠిన నియంత్రణలను ఎత్తివేయడమే లక్ష్యంగా ఈ చట్టంలో కొత్తగా సవరణలు తీసుకువస్తున్నట్టు స్థూలంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం ఇటీవల విడుదల చేసిన ప్రతిపాదనల ప్రకారం..

 • అటవీ భూములను అటవీయేతర అవసరాలకు వాడుకునేందుకు ప్రైవేటు సంస్థలు ఇప్పటివరకూ కేంద్రం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తున్నది. అయితే, తాజా సవరణలు అమల్లోకి వస్తే మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులకు ఈ నిబంధనలు వర్తించబోవు.
 • 1980 కంటే ముందు రైల్వే, రహదారుల మంత్రిత్వ శాఖల కింద ఉన్న అన్ని అటవీ భూములు ఈ చట్టం కిందకు ఇకపై రాబోవు. ఈ భూముల్లో అభివృద్ధి ప్రాజెక్టులను ఆయా శాఖలు ఎలాంటి అనుమతులు అవసరం లేకుండానే జరుపుకోవచ్చు.
 • రోడ్డు పక్కన చెట్లను పెంచడం తప్పనిసరి కాబోదు. అడవుల్లో నుంచి చమురు, సహజ వాయువు నిక్షేపాలను ఇకపై వెలికితీసుకోవచ్చు.
 • అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంలో నిర్మించే రక్షణ ప్రాజెక్టుల కోసం అటవీశాఖ అనుమతులు అవసరంలేదు.

ఎందుకు వ్యతిరేకత?

 • మౌలిక వసతుల ప్రాజెక్టుల పేరుచెప్పి కార్పొరేట్లు చెట్లను యథేచ్చగా నరికివేయవచ్చు.
 • పైవేటు అటవీ భూములను చట్టం నుంచి మినహాయిస్తే, అవి కనుమరుగవ్వచ్చు. ఉదాహరణకు.. ప్రైవేటు పరిధిలో ఉన్న ఉత్తరాఖండ్‌లోని 4 శాతం అటవీ ప్రాంతం ఎడారిగా మారుతుంది.
 • గిరిజనులు, అటవీ జంతువుల మనుగడ, పర్యావరణ సమతుల్యత దెబ్బతినొచ్చు. రియల్‌ ఎస్టేట్‌ భూతం పడగ విప్పుతుంది.

హడావుడిగా చర్యలు
అటవీ పరిరక్షణ చట్ట సవరణ కోసం కేంద్రం హడావుడిగా వ్యవహరిస్తున్నది. తాజా ప్రతిపాదనలపై వచ్చే 15 రోజుల్లోగా సూచనలు ఇవ్వాలని విపక్షాలను, ప్రజలను కోరింది. దీనిపై పర్యావరణ ప్రేమికులు, ప్రజలు, విపక్షాలు మండిపడుతున్నాయి. ఇంత హడావుడిగా ఈ చట్టానికి సవరణలు చేయాల్సిన అవసరమేమున్నదని ప్రశ్నిస్తున్నాయి. కాగా.. రెండు దఫాల్లో చేసే ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత తాజా ప్రతిపాదనలపై క్యాబినెట్‌ చర్చిస్తుంది. ఆ తర్వాత పార్లమెంటు ముందుకు ప్రతిపాదనలు వెళ్తాయి. అక్కడ ఆమోదం పొందితే అటవీ పరిరక్షణ చట్టానికి మరోసారి
సవరణలు చేస్తారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement