ఇద్దరమ్మాయిలతో, రుద్రమదేవి, సరైనోడు చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కేథరిన్ ట్రెసా (Catherine Tresa). ఈ ఏడాది భళా తందనాన చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది కేథరిన్. ఇందులో మీడియా ప్రతినిధిగా కనిపించింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. దీంతో ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాలపైనే ఆశలు పెట్టుకుందట కేథరిన్.
ఈ భామ ప్రస్తుతం కల్యాణ్ రామ్‌తో కలిసి బింబిసార (Bimbisara) చిత్రంలో నటిస్తోంది. ఇందులో వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటల్లో మెరిసిపోతుంది కేథరిన్. మరోవైపు నితిన్ నటిస్తున్న మాచెర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam)లో హీరోయిన్గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలు త్వరలోనే థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి.
బింబిసార ఆగస్టు 5న విడుదల కానుండగా..మాచెర్ల నియోజకవర్గం ఆగస్టు 12న విడుదల కానుంది. ఈ రెండింటిలో ఒక్క సినిమా క్లిక్ అయినా కేథరిన్ కెరీర్‌కు మంచి బ్రేక్ పడ్డట్టేనంటున్నారు ట్రేడ్ పండితులు. మరి కేథరిన్ ఆశలు నెరవేరుతాయా..? లేదా అన్నది మరికొన్ని రోజుల్లో తెలిసిపోనుంది.