సామాజిక బాధ్యతగా విలువైన పరికరాలు అందజేత
హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తేతెలంగాణ): కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లో భాగంగా రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థకు కెనరా బ్యాంక్ రూ.10 లక్షల విలువైన పరికరాలను అందజేసింది. హైటెక్‌సిటీ కొత్తగూడ సమీపంలోని బొటానికల్ గార్డెన్ నిర్వహణ కోసం కెనరా బ్యాంక్ సీజీఎం కేహెచ్ పట్నాయక్ బుధవారం ఓ ట్రాక్టర్‌తోపాటు వాటర్ ట్యాంకర్‌ను ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డికి అందజేశారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సైబరాబాద్‌కు బొటానికల్ గార్డెన్ ఎంతో విలువైన ప్రకృతి సంపద అని, దాన్ని కాపాడుకునేందుకే వీటిని అందించామని కెనరా బ్యాంక్ అధికారులు వెల్ల డించారు. కార్యక్రమంలో ఫారెస్ట్ కార్పొరేషన్ వైస్‌చైర్మన్, ఎండీ, జీ చంద్రశేఖర్‌రెడ్డి, జీఎం రవీందర్‌రెడ్డి, కెనరా బ్యాంక్ ప్రతినిధులు భాస్కర చక్రవర్తి, మమతా జోషీ, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, బొటానికల్ గార్డెన్ సిబ్బంది పాల్గొన్నారు.