కాలిఫోర్నియా : అక్రమ వలసదారులుగా పేర్కొంటూ 17 వేల మంది కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్‌లను కాలిఫోర్నియా రద్దు చేసింది. ఈ చర్య భారత, భారత సంతతి డ్రైవర్లను ప్రభావితం చేసే అవకాశముంది. ట్రక్ డ్రైవర్లుగా పనిచేస్తున్న వేలాది మందికి అక్రమంగా లైసెన్స్‌లు జారీ చేశారని డొనాల్డ్ ట్రంప్ సర్కార్ ఆందోళన వ్యక్తం చేయటంతో, కాలిఫోర్నియా ప్రభుత్వం 17 వేల మందిపై చర్యలు చేపట్టింది.
ఈ ఏడాది ఆగస్టులో ఫ్లోరిడాలో అక్రమ వలసదారుడు నడిపిన ట్రక్ ప్రమాదానికి కారణమైంది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ట్రక్ డ్రైవర్..భారతదేశానికి చెందిన అక్రమ వలసదారుడని దర్యాప్తులో తేలింది. ఈ ఘటన అమెరికా వ్యాప్తంగా కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ ఆడిట్‌కు దారి తీసింది.