మెక్సికో సిటీ: ఉత్తర మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మెక్సికోలోని ఆరిజోనాకు సరిహద్దు పట్టణమైన సోనోయట సమీపంలో మినీ ట్రక్కును ఓ బస్సు ఢీకొట్టింది. దీంతో 16 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. అమెరికా సరిహద్దుల్లోని సొనోరా రాష్ట్రంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు శాన్ లూయిస్ రియో కొలరాడో వద్ద రోడ్డుపక్కన ఆగిఉన్న ట్రెయిల్ను ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పి పక్కనే వెళ్తున్న మరో ట్రక్కును గుద్దింది. దీంతో 16 అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడినవారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని సోనోరా స్టేట్ ప్రాసిక్యూటర్ కార్యాలయం వెల్లడించింది.