అక్కడ విదేశీ వస్తు దహనం జరుగుతున్నది. జనమంతా గుమిగూడి విదేశీ వస్తువులను మంటల్లో వేస్తున్నారు. అవి భగభగా మండుతున్నాయి. అప్పుడు నెహ్రూ అక్కడే ఉన్నారు. ఆయనకు సిగరెట్ తాగే అలవాటు ఉండేది. పైగా ఫారిన్ సిగరెట్లు కాల్చేవారు. ‘మేం విదేశీ వస్తువులు తగులబెడుతుంటే తమరు విదేశీ సిగరెట్లు తాగుతున్నారా?’ అని అక్కడున్న వారు ఎవరో కొంటెగా ప్రశ్నించారు. దానికి ‘ఆయన నేను తాగడం లేదు.. ఈ విదేశీ వస్తువును తగులబెడుతున్నాను’ అని అంతే కొంటెగా సమాధానమిచ్చారట.