న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ ఆధీనంలోని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ సోమవారం (ఆగస్టు 9) నుంచి ప్రారంభంకానుంది. ఆసక్తి, అర్హత కలిగినవారు ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవాలని బీఎస్ఎఫ్ కోరింది. మహిళా, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 269
అర్హత: మెట్రిక్యుల్యేషన్ లేదా దానికి సమానమైన కోర్సు చేసి ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 23 ఏండ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ఎత్తు: పురుషులు- 170 సెంటీమీటర్లు, మహిళలు 157 సెంటీమీటర్లు
ఛాతీ: 85 సెంటీమీటర్లు
ఎంపిక ప్రక్రియ: శారీరక దారుఢ్యం, అకడమిక్ మార్కులు, వైద్య పరీక్షల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 9
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 22
వెబ్సైట్: https://bsf.gov.in/