BRS | అపర భగీరథుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావడం తెలంగాణ బిడ్డలందరికీ గర్వకారణమని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి అన్నారు. నాడు ఒక్కడితో మొదలైన తెలంగాణ ఉద్యమం తారస్థాయికి చేరి పార్లమెంట్ వ్యవస్థనే ప్రభావితం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించినట్లుగానే భారతదేశాన్ని ప్రపంచంలోనే తిరుగులేని దేశంగా తీర్చి దిద్దుతారని అన్నారు.
దేశంలో సకల వనరులు ఉన్నప్పటికీ నాయకత్వ లేమితో దేశం అన్ని రంగాల్లో వెనక బడిపోయిందని వెల్లడించారు. దేశంలో ఉన్న నీటివనరులు, సహజ సంపదను వాడుకుని దేశాన్ని అభివృద్ధిపథంలో తీసు కెళ్లడానికి కేసీఆర్ తీసుకున్న బీఆర్ఎస్ నిర్ణయం భవిష్యత్లో అద్భుత ఫలితాలు సాధిస్తుందని అన్నారు.