జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దొరికినవాళ్లను దొరికినట్టు ఈడ్చిపారేశారు. ఎంపీ, ఎమ్మెల్యే ఇలా ఎవరినీ చూడకుండా అడ్డుకున్నారు. అడుగు ముందుకు వేయకుండా చుట్టుముట్టారు. అంతేకాదు.. తాను బీఆర్ఎస్ అభ్యర్థినని మాగంటి సునీతా గోపీనాథ్ చెప్పినా పోలీసులు వినలేదు. దీంతో ఆమె కంటతడి పెట్టారు.
బోగస్ ఓటర్లు ఉన్నా మహ్మద్ ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకున్న ఎంపీ వద్దిరాజు రవిచంద్రను అడ్డుకుంటున్న పోలీసులు. తాను ఎంపీనని చెప్పినా వినకుండా చుట్టుముట్టి అడుగు ముందుకు వేయకుండా అడ్డుకున్న పోలీసులు

మహమూద్ ఫంక్షన్హాల్లో బోగస్ ఓటర్లు ఉన్నారని నిరసన వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై చెయ్యి చేసుకున్న పోలీసులు. చిత్రంలో బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను ఈడ్చిపారేస్తున్న పోలీసు

మహ్మద్ ఫంక్షన్హాల్లో బోగస్ ఓటర్లు ఉన్నారన్న విషయం తెలిసి అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. తాను అభ్యర్థినని చెప్పినా వినలేదు. ముందుకు పోనివ్వలేదు. దీంతో తీవ్ర భావోద్వేగానికి గురై కంట తడి పెట్టిన మాగంటి సునీతా గోపీనాథ్

మహ్మద్ ఫంక్షన్‌హాల్ వద్ద ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని అడ్డుకుంటున్న పోలీసులు

జూబ్లీహిల్స్‌లోని ఎల్ఎన్ నగర్లో బీఆర్ఎస్ కార్యకర్తను పోలీసులు ఈడ్చుకెళ్తుతుండగా ఎందుకిలా దౌర్జన్యం చేస్తున్నారని నిలదీస్తున్న మాగంటి గోపీనాథ్ కుమార్తె

యూసుఫ్‌గూడలోని అమరావతి స్కూల్ వద్ద బీఆర్ఎస్ నేత వాసుదేవరెడ్డిని ఈడ్చిపారేస్తున్న పోలీసులు. తాను దివ్యాంగుడినని చెప్పినా వినని పోలీసులు

జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌ను అడ్డుకుంటున్న పోలీసులు

యూసుఫ్‌గూడలోని అమరావతి స్కూల్ వద్ద బీఆర్ఎస్ నేత పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు

యూసుఫ్‌గూడలోని అమరావతి స్కూల్ వద్ద బీఆర్ఎస్ నేత సతీశ్‌రెడ్డిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

మహ్మద్ ఫంక్షన్‌హాల్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ నేతలు గోసుల శ్రీనివాస్, పెద్ది సుదర్శన్‌రెడ్డి తదితరులను అడ్డుకుంటున్న పోలీసులు