ఇండియాలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ పెళ్లిళ్లలో వధూ, వరులతోపాటు వారి సోదరసోదరీమణులు చేసే నృత్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కొన్ని వివాహ వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటి ఒక డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వధువు సోదరి చేసిన డ్యాన్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఈ వీడియోను ‘వైవాహిక్’ అనే యూజర్ ఇన్స్టాలో షేర్చేశారు. ఇందులో వధువు సోదరి గోల్డెన్ కలర్ లెహంగా ధరించి, ‘అత్రంగి రే’ సినిమాలోని ‘చకా చక్’ పాటపై అదిరిపోయే స్టెప్పులేసింది. ఆమె డ్యాన్స్ చూసి అక్కడున్నవారంతా చప్పట్లతో అభినందించారు. ఇప్పటివరకూ ఈ వీడియోను 6,000 మంది లైక్ చేశారు. చూసినవారంతా లవ్ ఎమోజీలు ఇస్తున్నారు. వావ్.. అద్భుతం అంటూ కామెంట్ చేస్తున్నారు.