Brahmanandam | కెరీర్ అంటే 20 ల్లోనే మొదలు పెట్టాలా.. 60ల్లో మొదలు పెట్టకూడదా..? తాజాగా విడుదలైన పంచతంత్రం ( Panchathantram ) టీజర్లో బ్రహ్మానందం చెప్పిన డైలాగ్ ఇది. అదేదో సినిమా కోసం చెప్పిన డైలాగ్‌లా లేదు. తన రియల్ లైఫ్ గురించి చెబుతున్నట్లుగా ఉంది. నిజంగానే తన కెరీర్ కొత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు బ్రహ్మానందం. 65 ఏళ్లు పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయాలని తహతహలాడుతున్నాడు. మూడున్నర దశాబ్దాలుగా ప్రేక్షకులను నాన్ స్టాప్ నవ్వుల్లో ముంచెత్తుతున్న ఈ హాస్యనట చక్రవర్తి.. ఇకపై వాటికి కాస్త బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఇప్పటి నుంచి చేయబోయే సినిమాలో కాస్త ఎమోషనల్ టచ్ ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు బ్రహ్మానందం.
తనును ఇలా కూడా ప్రేక్షకులు చూస్తారా అనే అనుమానం కూడా చాలా రోజుల నుంచి ఉంది. అయితే కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ప్రయోగాలు చేయకుండా వచ్చిన ప్రతి క్యారెక్టర్ చేసుకుంటా వెళ్లిపోయాడు బ్రహ్మానందం. అలా దాదాపు 1250 సినిమాల్లో ఎంతో నవ్వించాడు. ఇక ఇప్పటి నుంచి నవ్వుతో పాటు ఏడిపిస్తాను అంటున్నాడు ఈ లెజెండరీ నటుడు. ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నాడు బ్రహ్మానందం. ఇన్నేండ్లుగా మనం చూస్తూ వచ్చిన బ్రహ్మీకి.. ఇకపై చూడబోయే బ్రహ్మానందానికి తేడా ఉండేలా చూసుకుంటున్నాడు. విలక్షణ పాత్రల వైపు అడుగులు వేస్తున్నాడు ఈయన. ఈ క్రమంలోనే పంచతంత్రం సినిమాలో ఈయన వేదవ్యాస్ అనే పాత్రలో నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన టీజర్ ఇప్పుడు విడుదలైంది.
కెరీర్ అంటే 20 ల్లోనే మొదలు పెట్టాలా.. 60 ల్లో మొదలు పెట్టకూడదా అంటూ ఈ టీజర్లో బ్రహ్మానందం ప్రశ్నిస్తున్నాడు. కచ్చితంగా ఈ సినిమాలో బ్రహ్మానందం చేసిన వేదవ్యాస్ క్యారెక్టర్ అతడిలోని మరో కోణాన్ని బయటకు తీసుకువస్తోంది అని గట్టిగా నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. మరోవైపు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ సినిమాలో కూడా డిఫరెంట్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు బ్రహ్మానందం. ఈ రెండు సినిమాల్లో చేసిన పాత్రలు ఇప్పటి వరకు తన కెరీర్లో ఎప్పుడూ చేయలేదని అంటున్నాడు ఈ సీనియర్ కమెడియన్. ఇప్పటి నుంచి కచ్చితంగా కామెడీ చేస్తూనే విభిన్న పాత్రలు ఎంచుకుంటానని అంటున్నాడు బ్రహ్మానందం. ఈయనలో ఈ రెండో కోణం చూడటానికి ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
సమ్మర్ బాట పట్టిన పెద్ద సినిమాలు.. అయినా కేజీఎఫ్ 2 డేట్‌ను టచ్ చేయని టాలీవుడ్
విశాల్ ముందు అగ్నిపరీక్ష.. కరోనా కష్టకాలంలో సామాన్యుడు ఆకట్టుకుంటాడా..?
ఆ కమెడియన్ చనిపోయే ముందు నన్ను చూస్తానన్నాడు.. బ్రహ్మానందం ఎమోషనల్..
Brahmanandam memes | మీమ్స్ కా బాప్ బ్రహ్మానందం..వారికి బ్రహ్మీ ధన్యవాదాలు