రాధికా ఆప్టే.. ఈ పేరు చెబితే అందరికి బోల్డ్ పాత్రలే గుర్తుకొస్తాయి. న్యూడ్, సెమీ న్యూడ్ పాత్రలు పోషిస్తూ..సెన్సెషన్ క్రియేట్ చేసిన రాధికా తెలుగులో రక్తచరిత్ర రెండు భాగాలు, ధోనీ, లెజెండ్, లయన్ వంటి చిత్రాల్లో నటించారు. ఈ అమ్మడు బోల్డ్నెస్తోనే కాదు బోల్డ్ కామెంట్స్‌తోను వార్తలలో నిలుస్తూ ఉంటుంది. ఆమె డిక్షనరీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇవ్వడం లాంటివి చాలానే ఉన్నాయి.
ఈ మధ్య సినిమలు కాస్త తగ్గించిన రాధికా హాట్ హాట్ ఫొటో షూట్స్‌తో రెచ్చిపోతుంది. అయితే ఉన్నట్టుండి ఈ బ్యూటీపై నెటిజన్లు అటాక్ చేయడంతో ఇష్యూ వైరల్ అయింది. కొన్నాళ్లుగా బాలీవుడ్లో సంచలనం సృష్టిస్తున్న రాజ్‌కుంద్రా కేసులో రాధికా ప్రమేయం లేకపోయిన ఆ ఇష్యూ ఈమె మెడకు చుట్టుకుంది. మీటూ సమయంలో చాలా గట్టిగా మాట్లాడిన ఈవిడ ఇప్పుడు రాజ్‌కుంద్రా విషయంలో సైలెంట్ ఎందుకు అయింది.
భారత సంప్రదాయాలను కించపరిచేలా న్యూడ్, సెమీ న్యూడ్ షాట్స్ తీస్తున్న రాధికా ఆప్టేను వెంటనే బహిష్కరించాలి. ఆమె సినిమాలను కూడా చూడడం మానేయాలి అంటూ #BoycottRadhikaApte ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఆమె యాంటీ హిందూ. రాధికా ఆప్టే ఇండియన్ కల్చర్ కు వ్యతిరేకం.తక్షణమే రాధికాని బాయ్‌కాట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.దీనిపై రాధికా స్పందన ఏంటో చూడాలి.