మహబూబ్నగర్లో ఓ బుడ్డోడు పోలీసులకే చుక్కలు చూపించాడు. ముఖానికి మాస్క్, తలకు హెల్మెట్ లేకుండా ఓ మైనర్ పిల్లాడు బండి నడుపుకుంటూ వెళ్లడం అక్కడే ఉన్న ఓ ట్రాఫిక్ పోలీసు గమనించాడు. లైసెన్స్ లేకుండా చిన్న పిల్లలు బైక్ నడపొద్దని ట్రాఫిక్ పోలీస్ చెప్పగా.. ఇది ఎలక్ట్రానిక్ వెహికల్.. దీనికి లైసెన్స్ అక్కర్లేదంటూ తెగ ఆటిట్యూడ్ చూపించేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.