టాంజానియా : తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతికైన బోనాల పండుగను టాంజానియాలోని దార్-ఎస్ -సలాం నగరంలో తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు.
స్థానికంగా ఉన్న flames కాంపౌండులో బోనాల వేడుకలను నిర్వహించారు.
ప్రజలందరికి మహంకాళి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు.
తెలంగాణ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కును చెల్లించుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందజేయడంలో తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ముందు వరుసలో ఉంటుందని తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ టాంజానియా అడ్వైజర్ వంగ నర్సింహా రెడ్డి అన్నారు.
కార్యక్రమంలో సంతోష్ రెడ్డి పట్లోల, సురేందర్ సెలం, సూర్య మోహన్ రెడ్డి , మధురెడ్డి, తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ టాంజానియా కార్యవర్గ సభ్యులు శ్రీనిలై, చారి గుడికందుల, అశ్రీత్, మహేష్ రెడ్డి, సంతోష్ కొత్త, ప్రవీణ్ చంద్ర, మధు రెడ్డి, సైదులు, కుశల్ రెడ్డి, నూజహార్, ప్రణీత్ రెడ్డి, వెంకటేష్, రాజేష్, సురేష్, రాజు, పెర్రి కనిష్క్, శేషు, సుమీద్ పాల్గొన్నారు.