హైదరాబాద్: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు (Indigo Airlines) చెందిన విమానానికి బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. కువైట్ (Kuwait) నుంచి హైదరాబాద్ (Hyderabad) వస్తున్న విమానానికి బెదింపు మెయిల్ వచ్చింది. దీంతో విమానాన్ని మార్గమధ్యలో ముంబైకి (Mumbai) దారి మళ్లించారు. క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం విమానాన్ని గమ్యస్థానానికి పంపించనున్నారు.
కాగా, షెడ్యూల్ ప్రకారం గత అర్ధరాత్రి 1.30 గంటలకు ఇండిగో 6ఈ1234 విమానం కువైట్ నుంచి హైదరాబాద్ బయల్దేరింది. మంగళవారం ఉదయం 8.10 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో దిగాల్సి ఉన్నది. బాంబు బెదిరింపుతో విమానాన్ని ముంబైకి దారిమళ్లించారు. అయితే ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని విమానయాన సంస్థ ప్రకటించింది.