శంషాబాద్ రూరల్, డిసెంబర్ 2: కువైట్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు 6ఈ-1234 నంబర్‌గల విమా నం 235 మంది ప్రయాణికులతో వస్తున్నది. కస్టమర్ సపోర్టు విభాగానికి మంగళవారం ఉదయం 5:12 గంటలకు బాంబు బెదిరింపు వచ్చింది.
అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు భద్ర తా అధికారులు, పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేసి.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండిం గ్ కాకుండా ముంబై ఎయిర్‌పోర్టుకు తరలించారు. ఉదయం 7:47 గంట లకు ముంబైలో సురక్షితంగా ల్యాం డింగ్ అయిందని ఎయిర్‌పోర్టు వర్గా లు తెలిపాయి. ఈ విషయంపై అధికారులు ఫిర్యాదు చేయగా, దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.