e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home News తెలుగు సినిమాల‌పై క‌న్నేసిన బాలీవుడ్..అవేంటో తెలుసా..?

తెలుగు సినిమాల‌పై క‌న్నేసిన బాలీవుడ్..అవేంటో తెలుసా..?

ఒక‌పుడు బాలీవుడ్ సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యేవి. కానీ ఇపుడు ట్రెండ్ మారింది. తెలుగులో క‌థాబ‌ల‌మున్న చిత్రాలు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. జాతీయ స్థాయిలో పుర‌స్కారాల‌ను కూడా అందుకుంటూ..తెలుగు సినీ పరిశ్ర‌మ ఖ్యాతిని ద‌శ‌దిశ‌లా వ్యాప్తి చేస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం తెలుగు చిత్రాల‌ను హిందీలో రీమేక్ చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారంటే మ‌న సినిమాల రేంజ్ అర్థం చేసుకోవ‌చ్చు.

ఇప్ప‌టికే ప‌లు హిట్ సినిమాలు రీమేక్ అవుతుండ‌గా..తాజాగా బీటౌన్ స్టార్ హీరో అజ‌య్ దేవ్‌గ‌న్ తెలుగులో ఈ ఏడాది అల్ల‌రి న‌రేశ్ న‌టించిన నాంది చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. మ‌రోవైపు ర‌వితేజ హీరోగా న‌టిస్తోన్న ఖిలాడీని స‌ల్మాన్ ఖాన్ హిందీ లో రీమేక్ చేయాల‌ని భావిస్తున్న‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లు కూడా వ‌చ్చాయి. ఇటీవ‌లి కాలంలో హిందీలో రీమేక్ అవుతున్న తెలుగు సినిమాల్లో టాప్ 5 లిస్ట్‌పై ఓ లుక్కేస్తే…

- Advertisement -

జెర్సీ:

గౌత‌మ్ తిన్న‌నూరి డైరెక్ష‌న్ లో క్రికెట్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన జెర్సీ బాక్సాపీస్ వ‌ద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. అంతేకాదు అవార్డులను కూడా సొంతం చేసుకుంది. జెర్సీని హిందీలో రీమేక్ చేస్తుండ‌గా.. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్‌క‌పూర్ లీడ్ రోల్‌లో న‌టిస్తున్నాడు

అల వైకుంఠ‌పురంలో:

అల్లు అర్జున్-త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన చిత్రం అల వైకుంఠ‌పురంలో. 2020లో వ‌న్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ బెగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. బాలీవుడ్ యువ హీరో కార్తీక్ ఆర్య‌న్ ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నాడు. రోహిత్ ధావ‌న్ ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను చూసుకోబోతున్నాడు.

డీజే :

అల్లు అర్జున్‌, హ‌రీష్ శంక‌ర్ కాంబోలో వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాపీస్ వ‌ద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీని బాలీవుడ్ యాక్ట‌ర్ సిద్దార్థ్ మ‌ల్హోత్రా లీడ్ రోల్ చేస్తున్నాడు. గ‌తేడాదే సెట్స్ పైకి వెళ్లాల్సి ఉండ‌గా కోవిడ్ మ‌హ‌మ్మారి ఎఫెక్ట్‌తో నిలిచిపోయింది. హిందీ రీమేక్‌ను ఎవ‌రు డైరెక్ట్ చేయ‌బోతున్నార‌నేది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్ గానే ఉంది.

హిట్‌:

శైలేష్ కొల‌ను డైరెక్ష‌న్ లో విశ్వ‌క్ సేన్ హీరోగా థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కింది. మిస్సింగ్ ఉమెన్ కేసు విచార‌ణ లో పోలీస్ అధికారిగా విశ్వ‌క్ సేన్ న‌ట‌న అందిరినీ ఆక‌ట్టుకుంది. కాప్ థ్రిల్ల‌ర్ హిందీ రీమేక్ లో రాజ్ కుమార్ రావు హీరోగా న‌టిస్తున్నాడు. టాలీవుడ్ నిర్మాత దిల్ రాజ్ కోప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు

బ్రోచేవారెవ‌రురా:

క్రైం కామెడీగా శ్రీవిష్ణు, నివేదా థామ‌స్, నివేదా పేతురాజ్, స‌త్య‌దేవ్ కాంబినేష‌న్ లో చిన్న సినిమాగా వ‌చ్చి మంచి విజ‌యం సాధించింది. ఈ చిత్రంలోని పాత్ర‌లు అంద‌రినీ ఆలోచింప‌జేసేలా సాగుతాయి. ఇదే చిత్రాన్ని క‌ర‌ణ్ డియోల్‌, అభ‌య్ డియోల్ తీస్తుండ‌గా..అజ‌య్ దేవ్ గ‌న్ రీమేక్ రైట్స్ ద‌క్కించుకున్నాడు.

ఇవి కూడా చదవండి..

చిరంజీవి సినిమాలో క్రేజీ బాలీవుడ్ స్టార్..!

ప్ర‌భాస్ టు సాయిప‌ల్ల‌వి..సౌతిండియా స్టార్లు ఏం చ‌దివారో తెలుసా..?

ఈ స్టార్ హీరోకు పాపుల‌ర్ హీరోయిన్ కావాల‌ట‌..!

ఫాలోవ‌ర్లు, ఫ్యాన్స్ కు కొర‌టాల శివ షాక్

సెట్‌లో స‌న్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్‌..వీడియో

Recommended Content by ntnews.com

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana