shah rukh khan | ఒకప్పుడు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సినిమా రిలీజ్ అవుతుందంటే.. బాక్సాఫీస్ దగ్గర ఉండే సందడి గురించి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. దాదాపు పదేళ్ల కింద 400 కోట్లు వసూలు చేసిన ఘనత ఆయన సొంతం. చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాలో ఆ రోజుల్లోనే ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాశాడు షారుక్ ఖాన్. అయితే ఎంత పెద్ద హీరోకు అయినా ఏదో ఒక సమయంలో కచ్చితంగా గడ్డు కాలం నడుస్తోంది. అలాంటి బ్యాడ్ టైం గత కొన్ని ఏళ్లుగా షారుక్ ఎదుర్కొంటున్నాడు. 2017 నుంచి ఆయన సినిమాలో ఒక్కటి కూడా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయలేదు. వచ్చిన సినిమా వచ్చినట్లు అలా వెళ్లిపోతుంది.
అందుకే నాలుగైదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నాడు కింగ్ ఖాన్. వస్తే మళ్లీ బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసే పెద్ద సినిమాతో రావాలని చూస్తున్నాడు. అందుకే కావాల్సినంత టైం తీసుకుంటున్నాడు షారుక్ ఖాన్. 2018 చివర్లో జీరో సినిమాతో వచ్చిన ఈయన.. మధ్యలో మరో సినిమా చేయలేదు. నాలుగేళ్ల తర్వాత పర్ఫెక్ట్ కం బ్యాక్ ప్లాన్ చేసుకుంటున్నాడు బాద్షా. ప్రస్తుతం ఒకేసారి మూడు సినిమాలకు కమిట్ అయ్యాడు ఈ సీనియర్ హీరో. బ్యాంగ్ బ్యాంగ్, వార్ లాంటి సినిమాలతో సంచలన విజయాలు అందుకున్న సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో పఠాన్ సినిమా చేస్తున్నాడు షారూక్.
దీంతో పాటు సౌత్ దర్శకుడు అట్లీ కుమార్ దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయ్యాడు. ఇక మొన్నటికి మొన్న బాక్సాఫీసు మాంత్రికుడు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో డంకీ సినిమాకు సైన్ చేశాడు. 20 ఏళ్ల కెరీర్లో కేవలం 5 సినిమాలు మాత్రమే చేశాడు హిరాణి. మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగేరహో మున్నాభాయ్, 3 ఇడియట్స్, పీకే, సంజూ వేటికవే విభిన్నమైన సినిమాలు.. అన్నీ సంచలన విజయాలు. అలాంటి దర్శకుడితో కం బ్యాక్ సినిమా చేస్తున్నాడు షారూక్ ఖాన్. మరి ఈ మూడు సినిమాలతో బాలీవుడ్ బాద్ షా ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.
BB4 | బోయపాటితో నాలుగోసారి బాలకృష్ణ సై.. ఈసారి మామూలుగా ఉండదు!!
KGF చాప్టర్ 2’ రికార్డుల మోత.. రాఖీ బాయ్ దెబ్బకు బాలీవుడ్ బేజారు..
Pawan Kalyan | హరిహర వీరమల్లు విషయంలో అసంతృప్తిగా పవన్..కారణమేంటో ?
ఎన్టీఆర్ సినిమా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదంట.. ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన కొరటాల