లండన్, సెప్టెంబర్ 28: కరోనా బారిన పడిన వ్యక్తికి లాంగ్ కొవిడ్ ముప్పు ఉన్నదా లేదా అన్నది రక్తపరీక్ష ద్వారా గుర్తించవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. కొవిడ్ బారిన పడిన కొందరు వ్యక్తులు వైరస్ నుంచి దీర్ఘకాలిక ఇబ్బందులను అనుభవిస్తుంటారు. వాటిని లాంగ్ కొవిడ్ లక్షణాలు అంటారు. యూకేలోని యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకులు కరోనా సోకిన హెల్త్ వర్కర్ల రక్తంలోని ప్రొటీన్లను విశ్లేషించారు. వ్యాధి సోకని వారి నమూనాలతో వాటిని పోల్చిచూశారు. లాంగ్ కొవిడ్ లక్షణాలున్న వ్యక్తుల్లో 6 వారాల వ్యవధిలో ప్రొటీన్ల స్థాయిలో భారీ వ్యత్యాసాన్ని గుర్తించారు.