వాషింగ్టన్, సెప్టెంబర్ 27: రక్తపోటు తగ్గించేందుకు మార్కెట్లో మందులు కొల్లలు ఉన్నాయి. కానీ ప్రాణాయామం కూడా రక్తపోటును చాలావరకు తగ్గిస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. గట్టిగా ఊపిరి తీసుకుని వదలడం వల్ల ఛాతీ కండరాల్లో ఒత్తిడి తగ్గిపోతుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతిమంగా రక్తపోటు తగ్గిస్తుందని కొలరాడో బోల్డర్ యూనివర్సిటీ, అరిజోనా యూనివర్సిటీ సంయుక్తంగా జరిపిన అధ్యయనంలో తేలింది. 18-82 ఏండ్ల మధ్యవయసు కలిగిన 128 మంది వలంటీర్లు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు.