న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీకి ధన్యవాదాలు చెప్పారు. ఒకవైపు దేశంలో నిరుద్యోగం పెరుగుతుండగా, మరోవైపు వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని పోస్టుల ఖాళీలు లక్షల్లో ఉన్నాయి. దీనికి సంబంధించిన తన డేటాను చదివి వినిపించిన ఒవైసీకి వరుణ్ గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. నిరుద్యోగం నేడు దేశంలో అత్యంత బర్నింగ్ సమస్య అని అన్నారు. ఈ సమస్యపై యావత్ దేశ నాయకులు ప్రభుత్వం దృష్టిని ఆకర్షించాలని కోరారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరగాలని, అప్పుడే దేశం శక్తివంతం అవుతుందన్నారు.
కాగా, ఉత్తర ప్రదేశ్లోని పిలిభిత్ ఎంపీ అయిన వరుణ్ గాంధీ ఇటీవల సొంత పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. దేశంలోని నిరుద్యోగ సమస్యను ఆయన లేవనెత్తారు. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలను బయటపెట్టారు. ప్రస్తుతం దేశంలోని నిరుద్యోగం గత మూడు దశాబ్దాల కంటే ఎక్కువగా ఉన్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తున్నదని దుయ్యబట్టారు. ఒక వైపు ఉద్యోగాలు లేక దేశంలోని కోట్ల మంది యువత నిరుత్సాహంలో మునిగి ఉండగా, మరోవైపు దేశ వ్యాప్తంగా 60 లక్షలకుపైగా మంజూరైన పోస్టులు ఖాళీగా ఉండటాన్ని విమర్శించారు.
ఈ కేంద్ర గణాంకాలను నమ్మవచ్చా? అని ప్రశ్నిస్తూ పలు శాఖల్లోని ఉద్యోగ ఖాళీల సమాచారాన్ని వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు. ఈ పోస్టులకు కేటాయించిన బడ్జెట్ ఎక్కడకు వెళ్లింది? అని ప్రశ్నించారు. ప్రతి యువతకు దీని గురించి తెలుసుకునే హక్కు ఉందన్నారు.
మరోవైపు అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల మాట్లాడుతూ పలు కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని ఉద్యోగాల ఖాళీలను వెల్లడించారు. ఇది తన డేటా కాదని, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ పేర్కొన్న సమాచారమని చెప్పారు. ఈ నేపథ్యంలో అసద్దుద్దీన్ ఒవైసీకి వరుణ్ గాంధీ ధన్యవాదాలు చెబుతూ సోమవారం ట్వీట్ చేశారు.
बेरोज़गारी आज देश का सबसे ज्वलंत मुद्दा है और पूरे देश के नेताओं को इस मुद्दे पर सरकार का ध्यान आकृष्ट कराना चाहिए। बेरोज़गार नौजवानों को न्याय मिलना चाहिए,तभी देश शक्तिशाली बनेगा।
मैं आभारी हूँ की रोजगार के ऊपर उठाए गए मेरे सवालों का @asadowaisi जी ने अपने भाषण में ज़िक्र किया। pic.twitter.com/MAqfTOtHKZ
— Varun Gandhi (@varungandhi80) June 13, 2022
जब बेरोजगारी 3 दशकों के सर्वोच्च स्तर पर है तब यह आँकड़े चौंकाने वाले हैं।
जहां भर्तियाँ न आने से करोड़ों युवा हताश व निराश है, वहीं ‘सरकारी आँकड़ों’ की ही मानें तो देश में 60 लाख ‘स्वीकृत पद’ खाली हैं।
कहाँ गया वो बजट जो इन पदों के लिए आवंटित था?
यह जानना हर नौजवान का हक है! pic.twitter.com/dxtn64IeRz
— Varun Gandhi (@varungandhi80) May 28, 2022