లక్నో: ఉత్తరప్రదేశ్ అటవీ శాఖ ఓ ఏనుగుకు ఘనంగా పుట్టిన రోజు వేడుకలు నిర్వమించింది. బిజ్నోర్లోని కలగర్ ఎలిఫెంట్ క్యాంపులో నాలుగేండ్ల సావన్ (Sawan) అనే ఏనుగు ఉన్నది. ఆగస్టు 2న దాని పుట్టిన రోజు వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహించారు. దానికో ప్రత్యేకంగా ఫ్రూట్కేక్ తెప్పించడం విశేషం.
తొమ్మిదేండ్ల క్రితం కర్ణాటక తొమ్మిది ఏనుగులను అధికారులు జిమ్ కార్బేట్ పార్కుకు తీసుకొచ్చారు. అందులో ఒకటి నాలుగేండ్ల క్రితం ఆగస్టు 2న గున్న ఏనుగుకు జన్మనిచ్చింది. అధికారులు దానికి ‘సావన్’ (Sawan) అని పేరుపెట్టారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఆగస్టు 2న సావన్ పుట్టిన రోజును ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం నాలుగో ఏడాదిలోకి ప్రవేశించడంతో.. దానిని ప్రత్యేకంగా అలంకరించారు. ఫ్రూట్ కేట్ తెప్పించి కేట్ చేయించారు. ప్రస్తుతం ఈ బర్త్డే ఈవెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
Uttar Pradesh | Forest Department officials celebrated the birthday of 4-year-old elephant 'Sawan' at Kalagarh elephant camp in Bijnor yesterday pic.twitter.com/tcQjw7wD8E
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 3, 2022