న్యూఢిల్లీ : బయోలాజికల్-ఈ తయారు చేసిన ‘కార్బెవాక్స్’ టీకా బూస్టర్ డోస్ ఫేజ్-3 ట్రయల్స్‌కు భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అనుమతి ఇచ్చింది. భారత్ బయోటెక్ తర్వాత బయోలాజికల్స్-ఈ లిమిటెడ్ తర్వాత బూస్టర్ డోస్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతి పొందిన రెండో కంపనీ. వివరణాత్మక చర్చల తర్వాత నిపుణుల కమిటీ సిఫారసు మేరకు ఫేజ్-3 ట్రయల్స్ నిర్వహణకు డీసీజీఐ ఆమోదముద్ర వేసింది.
ఇంతకు ముందు బయోలాజికల్-ఈ కరోనా టీకాను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ (CDSCO) మంగళవారం కార్బెవాక్స్ వ్యాక్సిన్‌ను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు అనుమతి ఇచ్చింది. భారత్‌లో అభివృద్ధి చేసిన మొదటి ప్రోటీన్ ఆధారిత కొవిడ్ టీకా. ప్రస్తుతం కంపెనీ కొవిడ్-19 వ్యాక్సిన్ కార్బెవాక్స్‌ను నెలకు 75 మిలియన్ డోసుల చొప్పున ఉత్పత్తి చేయాలని భావిస్తున్నది. ఫిబ్రవరి 2022 నుంచి నెలకు 100 మిలియన్ డోస్‌ల కంటే ఎక్కువ టీకాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉందని కంపెనీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.