బింబిసార (Bimbisara) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు కల్యాణ్‌రామ్. డెబ్యూ డైరెక్టర్ వశిష్ఠ్ దర్శకత్వం వహించాడు. ఫాంటసీ డ్రామా నేపథ్యంలో హర్యాంక వంశస్థుడు బింబిసారుని జీవిత కథ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ బింబిసార చక్రవర్తిగా, దేవదత్తుడిగా ద్విపాత్రాభినయం చేశాడు.
బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల పంట పండించింది బింబిసార. తాజాగా ఈ చిత్రం డిజిటల్ రిలీజ్ టైం ఫిక్సయింది. 2022 అక్టోబర్ 21న జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జీ 5 సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. బింబిసార చిత్రంలో కేథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషించారు. ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి, ప్రకాశ్ రాజ్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు.
కల్యాణ్ రామ్ హోంబ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ బింబిసార చిత్రాన్ని నిర్మించారు. బింబిసార ప్రాంఛైజెస్గా రాబోతుండగా..సీక్వెల్ వివరాలపై త్వరలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉన్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్.