ఫాంటసీ డ్రామా నేపథ్యంలో టాలీవుడ్ హీరో కల్యాణ్‌రామ్ (Kalyan Ram) నటించిన చిత్రం బింబిసార (Bimbisara). మగధ రాజ్యాన్ని పాలించిన హర్యాంక వంశస్థుడు బింబిసారుని జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి వశిష్ఠ (Vasistha) దర్శకత్వం వహించాడు. కల్యాణ్ రామ్ బింబిసార చక్రవర్తిగా, దేవదత్తుడిగా డ్యుయల్ రోల్ లో అద్భుతంగా నటించాడని ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
కాగా ఈ మూవీ మొదటి రోజు నుంచి కలెక్షన్ల విషయంలో ఏ మాత్రం తగ్గేదే లే అనే డైలాగ్‌ను ఫాలో అవుతోంది. బింబిసార తాజా కలెక్షన్లపై ఓ అప్డేట్ బయటకు వచ్చింది. శనివారం నాటికి ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ వద్ద రూ.3,98,15,000 ($500K) మార్క్ క్రాస్ చేసింది. ఇదే జోష్ కొనసాగితే త్వరలోనే 1 బిలియన్ డాలర్ల క్లబ్లో జాయిన్ అవడం పక్కా అంటున్నారు ట్రేడ్ పండితులు.
రెండో వారంలో కొత్త లొకేషన్లలో మరిన్ని థియేటర్లు యాడ్ అవడం కలెక్షన్ల పరంగా మరింత కలిసొచ్చే అవకాశముందంటున్నారు విశ్లేషకులు. ఈ చిత్రం ఏపీ, తెలంగాణలో కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కు దాటేసింది. ఈ చిత్రంలో కేథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషించగా..శ్రీనివాస్ రెడ్డి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో నటించారు. కల్యాణ్ రామ్ హోంబ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.
Read Also : Mahesh Stylish look | మహేశ్ బాబు కొత్త లుక్..ఆ సినిమా కోసమేనా..!
Read Also : Tiger Shroff | క్రేజీ టాక్..మరో భామతో డేటింగ్లో యువ హీరో..!