– బీఆర్ఎస్లోకి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అశోక్, మాజీ సర్పంచ్ రమేశ్, అండేకార్ వెంకటేశ్
– గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
నల్లగొండ, డిసెంబర్ 02 : స్థానిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మంగళవారం నల్లగొండ జిల్లా చింతపల్లి మండల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అండేకార్ అశోక్, మాజీ సర్పంచ్ నాదరి రమేశ్, అండేకార్ వెంకటేశ్ తోపాటు పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ సమక్షంలో వారు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా రవీంద్ర కుమార్ మాట్లాడుతూ.. గత పదేండ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయన్నారు. రెండేళ్ల నుండి కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ చేసిన మోసాలు, బీఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమాన్ని గుర్తు చేస్తూ ప్రజల వద్దకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్యా నాయక్, కంకణాల వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్ రెడ్డి, కుంభం శ్రీశేలం గౌడ్ పాల్గొన్నారు.