వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్‌కు చెందిన రెండు శునకాలను వైట్‌హౌజ్ నుంచి స్వంత ఇంటికి పంపించేశారు. శ్వేతసౌధంలో ఫస్ట్ డాగ్ గా పిలువబడే మేజర్ శునకం ఇటీవల ఓ ఉద్యోగిని కరిచింది. దీంతో బైడెన్ వద్ద ఉన్న రెండు శునకాలను .. వెల్మింగ్టన్లోని డెలావేర్లో ఉన్న స్వంత ఇంటికి పంపించేశారు. బైడెన్ ఫ్యామిలీ వద్ద రెండు జర్మన్ షెపర్డ్ జాతి కుక్కలు ఉన్నాయి. దాంట్లో మేజర్ అనే శునకం చిన్నది. అయితే శ్వేతసౌధంలో పనిచేస్తున్న ఓ సెక్యూర్టీ ఏజెంట్‌ను ఇటీవల ఆ కుక్క కరిచింది. దీంతో ఆ రెండు శునకాలను బైడెన్ తన స్వంత ఊరికి పంపినట్లు తెలుస్తోంది. గత ఏడాది దేశాధ్యక్షుడిగా ఎన్నికైన కొన్ని రోజులకే శునకంతో ఆడుకుంటూ బైడెన్ తన కాలికి గాయం చేసుకున్న విషయం తెలిసిందే.