భూదాన్ పోచంపల్లి, జూన్ 09 : భూదాన్ పోచంపల్లి మండలం దేశ్ముఖి గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఆర్మీ డిగ్రీ మహిళా కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా (2025-26) ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణులైన విద్యార్థినులు ఈ నెల 11వ తేదీన నేరుగా అడ్మిషన్ ఎంపిక ప్రక్రియకు హాజరు కావొచ్చని కళాశాల ప్రిన్సిపాల్ డా.కే.శ్రీలత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు శుక్రవారం ఉదయం 6 గంటలకు కళాశాలను చేరుకోవాలన్నారు. ఎంపిక ప్రక్రియలో ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసి, ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. అభ్యర్థి కనీస ఎత్తు 152 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉండాలని, ఎలాంటి కంటి దోషములు, ఆనారోగ్య సమస్యలు ఉండరాదన్నారు. శారీరక సామర్థ్య పరీక్షలకు అనుకూలంగా ఉండేలా అభ్యర్థులు ట్రాక్ ప్యాంటు, టీ-షర్ట్, షూస్ ధరించి రావాలని, అన్ని సర్టిఫికెట్లను తప్పనిసరిగా తీసుకురావాలని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.