Bheemla Nayak on OTT | పవన్‌కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భీమ్లానాయక్’. మలయాళంలో సూపర్ హిట్టయిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను రాబడుతుంది. ఇప్పటివరకు ఈ చిత్రం దాదాపు 90 కోట్ల షేర్ కలెక్షన్లను 160 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది.బ్రేక్ ఈవెన్ కావాలంటే ఈ చిత్రం 18 కోట్ల వరకు సాధించాలి. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భీమ్లానాయక్ చిత్రం త్వరలోని ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. ఈ చిత్రం మార్చి చివరి వారం నుండి డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. డిస్నీ+హాట్‌స్టార్, ఆహా సంస్థలు డిజిటల్ హక్కులను కొనుగోలు చేశాయి. ఈ చిత్రంలో పవన్ పోలీస్ అధికారిగా కనిపించగా, రానా ఎక్స్ మిలిటరి ఆఫీసర్‌గా నటించాడు. నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైనమెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ మాటలు స్క్రీన్‌ప్లే అందించాడు. థమన్ సంగీతం అందించాడు.ఈ చిత్ర హిందీ ట్రైలర్ తాజాగా మేకర్స్ విడుదల చేశారు