టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్ పోషించిన చిత్రం భీమ్లానాయక్ (Bheemla Nayak). సాగర్ కే చంద్ర (Sagar K Chandra) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద మంచి హిట్‌గా నిలిచింది. రానా మరో లీడ్ రోల్లో నటించిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు. ఇటీవలే టీవీలో కూడా సందడి చేశాడు భీమ్లానాయక్. ఈ సినిమా టీవీలో రావడంతో పవన్ కల్యాణ్ అభిమానులు సంతోషంలో మునిగితేలారు.
కాగా సిల్వర్ స్క్రీన్‌పై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ చిత్రం టీవీ వరకు వచ్చేసరికి మాత్రం తన స్టామినా విషయంలో వెనక్కి తగ్గిందన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. టీవీ ప్రీమియర్ రేటింగ్ విషయంలో SD వెర్షన్లో 9.1, HD+SD వెర్షన్లో 10 నమోదైందని తాజా టాక్. అయితే పవన్ కల్యాణ్ స్టార్డమ్తో పోలిస్తే ఈ రేటింగ్ అంత పెద్దదేమి కాదని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భీమ్లానాయక్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఆహా, హాట్ స్టార్లలో స్ట్రీమింగ్ అవుతుండటంతో క్రేజ్ తగ్గిపోయిందని, అందువల్లే ఇలా జరిగిందని మరో టాక్ కూడా నడుస్తోంది.
అయితే టీవీ ప్రీమియర్‌లో స్టార్ హీరోల సినిమాలకు రేటింగ్ తగ్గడం కొత్తేమి కాదు. కానీ గతంలో ఓటీటీ ప్లాట్‌ఫాంల హవా లేనపుడు వచ్చిన క్రేజ్‌కు, ప్రస్తుతమున్న క్రేజ్‌కు మాత్రం వ్యత్యాసం ఉండటం సహజమే. థియేటర్లు, టీవీకి మధ్య డిజిటల్ ప్లాట్ ఫామ్స్ హవా నడుస్తుండటం కూడా పవన్ కల్యాణ్ సినిమా రేటింగ్ తగ్గిపోవడానికి ఓ కారణమంటున్నారు సినీ జనాలు.