ఖయ్యిమ్, నవీన్ నేని, రోయిల్శ్రీ, చింటు, శాంతి దేవగుడి, రామ్‌జగన్, చిత్రం శ్రీను ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘భళా చోర భళా’. ఫుల్‌లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మిస్టరీ చిత్రానికి ప్రదీప్ దర్శకుడు. జనని నిర్మాత. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రతి పాత్ర థ్రిల్లింగ్‌ను కలిగిస్తుంది. తప్పకుండా చిత్రం జనాదరణ పొందుతుందనే విశ్వాసం వుంది’ అన్నారు. చిత్రం శ్రీను, వెంకటేష్ , రవికిరణ్, రవిశంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: లక్ష్మణ్, సంగీతం: సింహ కొప్పర్తి, వెంకటేష్ అద్దంకి.