e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home News ఐదు వేల మందికి రూ.5.21 కోట్లు

ఐదు వేల మందికి రూ.5.21 కోట్లు

ఐదు వేల మందికి రూ.5.21 కోట్లు

ఖమ్మం నియోజకర్గంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల ద్వారా లబ్ధి
చెక్కుల పంపిణీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌
ఖమ్మం, మార్చి 28: పేద కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్లు చేసేందుకు తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఈ పథకాల కింద ఖమ్మం నియోజకవర్గంలో ఇప్పటి వరకూ ఐదు వేల మందికి రూ.5.21 కోట్ల లబ్ధి చేకూరిందని అన్నారు. ఖమ్మం వీడీవోస్‌ కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం 53 మంది లబ్ధిదారులకు రూ.53.06 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను, 43 మంది లబ్ధిదారులకు రూ.26.59 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా ప్రభావంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తనప్పటికీ వాటిని అధిగమించి పేదలకు లబ్ధిచేకూర్చిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, ఆర్డీవో రవీంద్రనాథ్‌, తహసీల్దార్లు శైలజ, నర్సింహారావు, టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయ ఇన్‌చార్జి ఆర్‌జేసీ కృష్ణ, మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు తాజుద్దీన్‌, రఘునాధపాలెం మండల అధ్యక్షుడు కుర్రా భాస్కర్‌రావు, మాజీ కార్పొరేటర్లు చావా నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

బ్లాక్‌ కాఫీ.. గుండెకు మంచిదేనా?

ఊపిరితిత్తులు శుభ్రం కావాలా..? ఇలా చేయండి..!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఐదు వేల మందికి రూ.5.21 కోట్లు

ట్రెండింగ్‌

Advertisement