e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home News జుట్టు పోషణ కోసం ఇలా చేయండి…

జుట్టు పోషణ కోసం ఇలా చేయండి…

జుట్టు పోషణ కోసం ఇలా చేయండి…

హైదరాబాద్,జూన్ 28:మందారం జుట్టు పోషణలో కీలక పాత్ర పోషిస్తుంది. మారిన మనిషి జీవన శైలి కారణంగా జట్టు రాలే సమస్య తీవ్రంగా పెరుగుతున్నది. వాయు,నీటికాలుష్యాలు, పోషకాహార లోపంతో జట్టు రాలే సమస్య ఎక్కువవుతోంది. నూటికి 99మంది జట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. జుట్టు పెరుగుదలకోసం పురాతన కాలం నుండే మందారంను ఉపయోగిస్తున్నారు.ఇది జుట్టు రాలడం నివారించి,జుట్టు పెంచడంలో గొప్పగా సహాయపడుతుంది.

-మందారం పువ్వును వాటర్ తో మిక్స్ చేసి పేస్ట్ చేయాలి. దీన్ని తలకు అప్లై చేసి గంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

- Advertisement -

-మందార పూలు తీసుకుని పేస్ట్‌ చేసి, దానికి ఆముదం కలిపి తలకు పట్టించాలి. త‌ర్వాత చల్లని నీటితో తల స్థానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మృదువుగా ఉండటంతో పాటు బలంగా ఉండి, ఒత్తుగా పెరుగుతుంది.

-మందారం ఆకులు, గోరింటాకు కొబ్బరినూనెలో వేసి నూనె కాగబెట్టాలి. ఈ మిశ్రమాన్ని నిల్వ ఉంచుకుని తలకు పట్టిస్తే జట్టురాలే సమస్య తగ్గుతుంది.

-కొబ్బరినూనెలో మందార‌ పూలను వేసి మరిగించి, చల్లారిన తర్వాత తలకు రాసుకుంటే జట్టు ఒత్తుగా పెరుగుతుంది.

-మందారపువ్వు పేస్ట్‌లో శెనగపిండి, పెరుగును క‌లిపి మెత్తగా చేసుకోవాలి. ఈ పేస్ట్ తలకు ప‌ట్టించి, కొంత స‌మ‌యం త‌ర్వాత‌ శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గుతుంది.

-మందార ఆకులను నానిన మెంతులతో కలిపి మెత్తగా నూరి తలకు ప్యాక్‌గా వేసి ఆరిన తర్వాత కుంకుడు కాయలతో తల స్నానం చేస్తే జట్టు మృదువుగా మారుతుంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జుట్టు పోషణ కోసం ఇలా చేయండి…
జుట్టు పోషణ కోసం ఇలా చేయండి…
జుట్టు పోషణ కోసం ఇలా చేయండి…

ట్రెండింగ్‌

Advertisement