టాలీవుడ్ స్టార్ హీరో నాని (nani) నటిస్తోన్న తాజా ప్రాజెక్టు దసరా (Dasara). సింగరేణి బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వం వహిస్తున్నాడు. హీరోయిన్ కీర్తిసురేశ్ (Keerthy Suresh) ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కాగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ పూర్ణ కీ రోల్ చేస్తుండట. రీసెంట్గా వచ్చిన అఖండ చిత్రంలో ఆఫీసర్ పాత్రలో మెరిసింది పూర్ణ. అయితే ఈ సారి నాని చిత్రంలో మాత్రం నెగెటివ్ రోల్లో కనిపించబోతుందని టాక్ నడుస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న పూర్ణ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.
ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్, సత్యన్ సూర్యన్ సంగీతం అందిస్తున్నారు. నాని పక్కా తెలంగాణ పాత్రలో మాస్ లుక్‌లో మెరువబోతున్నాడు.