నిర్మల్ అర్బన్/ఎదులాపురం, సెప్టెంబర్ 13 : తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం యేటా చీరలు పంపిణీ చేస్తు న్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10,08,606 మంది ఆడబిడ్డలకు అందించాల్సి ఉండగా, ఇప్పటికే 2 లక్షల 88 వేలు వచ్చినయ్. పలుచోట్ల గోదాంలలో వాటిని భద్రపరిచారు.
మిగతావి రేపో.. మాపో రానుండగా, త్వరలోనే రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సద్దుల బతుక మ్మకు తీరొక్క డిజైన్లలో సర్కారు కానుకలు ఇవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.