ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): పూల పండుగ చివరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తొమ్మిది రోజులుగా ప్రకృతిని ఆరాధిస్తూ, పూలతో బతుకమ్మను పేర్చిన తెలంగాణ ఆడబిడ్డలు అత్యంత ఆనందోత్సాహాల నడుమ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబురాల ఘనంగా జరుపుకోవడంపై సీఎం సంతోషం వ్యక్తంచేశారు. బతుకమ్మ స్ఫూర్తితో ప్రకృతిని, పచ్చదనాన్ని, నీటి వనరులను కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.